: నా సినీ కెరీర్ 'పాండవ వనవాసం'తో ప్రారంభమైంది: హేమమాలిని
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో మంచి పాత్ర పోషించే అవకాశం కల్పించిన ఈ చిత్ర యూనిట్ కు ధన్యవాదాలని ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని అన్నారు. ఈ సినిమాలో బాలయ్యతో పని చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందిన 'పాండవ వనవాసం'లో తాను తొలిసారి నటించానని, అందులో చిన్న పాత్ర పోషించానని అన్నారు. ఈ సినిమాలో బాలయ్యకు తల్లిగా నటించడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయన ప్రతిష్ఠాత్మక వందవ సినిమాలో నటించడం మరింత ఆనందంగా ఉందని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలయ్య గురించిన 'ఎన్బీకే నెవర్ బిఫోర్' అనే పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు.