: తెలంగాణ శాసనసభలో మరో ఐదు బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి కేటీఆర్
తెలంగాణ శాసనసభలో ఈ రోజు మరో ఐదు బిల్లులను రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టింది. వాటిలో ఖమ్మం నగరానికి పోలీసు కమిషనరేట్ ఏర్పాటు, జీహెచ్‌ఎంసీ రెండో సవరణ బిల్లు, తెలంగాణ వ్యాట్ నాలుగు, ఐదో సవరణ బిల్లులు, భూసేకరణ, పరిహారం సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులను పురపాక శాఖ మంత్రి కేటీఆర్ ప్రవేశ పెట్టారు. కాగా, శాసనసభలో ఇటీవలే ప్రవేశపెట్టిన ఎనిమిది బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.