: తాను ప్రభుత్వంలో భాగమేనంటోన్న సీబీఐ ఛీఫ్
సంచలనం సృష్టించిన బొగ్గు కుంభకోణంలో దర్యాప్తు వివరాలను కేంద్రంతో పంచుకోవడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురైన సీబీఐ ఛీఫ్ రంజిత్ సిన్హా ఏమంటున్నారో వినండి. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ కాదంటోన్న సిన్హా.. తానేమీ నివేదికను బయటి వ్యక్తులకు చూపలేదని, కేంద్ర న్యాయశాఖ మంత్రికే చూపానని అన్నారు. తాను ప్రభుత్వంలో భాగమైనప్పుడు, బొగ్గు కుంభకోణం నివేదికలోని వివరాలను న్యాయశాఖ మంత్రితో పంచుకోవడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.