: రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేస్తాం: సమాజ్ వాదీ పార్టీ


2017లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాదీ పార్టీ ఘన విజయాన్ని సాధించడం ఖాయమని ఆ పార్టీ నేత, మంత్రి శైలేంద్ర యాదవ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుల సమావేశం తిరుపతిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో సమాజ్ వాదీ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత యువ నేతలపై ఉందని చెప్పారు. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిందని... రానున్న ఎన్నికల్లో ఏపీలో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News