: రాజీనామా చేసిన టీమిండియా ఫిట్ నెస్ కోచ్


టీమిండియా ఫిట్ నెస్ కోచ్ శంకర్ బసు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీసీసీఐకి అందజేశారు. రాజీనామా నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ కోరినా... తన నిర్ణయాన్ని మార్చుకోలేదు బసు. కొందరు ఆటగాళ్ల కారణంగానే బసు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా.... భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహాలు గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో, తమ ట్రైనింగ్ చిట్కాలను మార్చాలని... తమకు ప్రత్యేక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని కొందరు ఆటగాళ్లు డిమాండ్ చేశారట. ఈ నేపథ్యంలో, బసు రాజీనామా చేశారని తెలుస్తోంది. మరోవైపు, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి శంకర్ బసు అంటే అమితమైన ఇష్టమట. స్క్వాష్ ప్లేయర్లు దీపికా పల్లికల్, జోస్నా చిన్నప్పలకు కూడా ఫిట్ నెస్ కోచ్ గా పనిచేశారు. అంతేకాదు, ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా సేవలు అందించారు. 

  • Loading...

More Telugu News