: ‘బస్తీమే సవాల్.. సెంటర్ నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దు’ : వంగవీటి రాధాకు వర్మ కౌంటర్ వార్నింగ్


తాను తీసిన ‘వంగవీటి’ సినిమా కరెక్ట్ కాదనుకుంటే ‘అసలు వంగవీటి’ అని మరో సినిమాను వంగవీటి రాధా తీసుకోవాలని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ‘అసలు వంగవీటి’ అనే సినిమాను తీసి లోకానికి చూపించుకోమని వంగవీటి రాధాకు ఆయన సూచించారు. ‘వంగవీటి’ సినిమాని దుర్బుద్ధితో చూసే వాళ్లు, తన ఉద్దేశం గురించి ఎంత మొత్తుకున్నాసరే.. పచ్చి నిజం ఏమిటంటే, వంగవీటి రంగాపై రాధాకి, రత్నకుమారికి ఉన్న గౌరవం కన్నా ఎన్నో రెట్లు తనకు ఎక్కువ గౌరవం ఉందన్నారు. ఈ నిజం.. నిజాయతీగా తమ గుండెలపై చేయి వేసుకున్న నిజమైన రంగా అభిమానులకు తెలుసని అన్నారు. ఈ సినిమా తీసిన తనను ఏదో చేసేస్తానన్న రాధా ఇచ్చిన వార్నింగ్ కి తన కౌంటర్ వార్నింగ్.. ‘బస్తీమే సవాల్.. సెంటర్ నేను చెప్పను, టైం నువ్వు చెప్పొద్దు’ అని వర్మ అన్నారు.

  • Loading...

More Telugu News