: సంగీతకారులపై ధనవర్షం... 40 లక్షల విలువైన 10, 20 నోట్లు విసిరారు!


గుజరాత్ లో సంగీత కార్యక్రమాలకు విశేషమైన ఆదరణ ఉంటుంది. పేరెన్నికగన్న గాయకులతో వేడుకల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా ఏర్పాటు చేసే ఈ సంగీత కార్యక్రమాల్లో డబ్బుల వర్షం కురుస్తుంది. తాజాగా నవ్సారీలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో ఇలాగే డబ్బుల వర్షం కురిసింది. సుమారు 40 లక్షల రూపాయల విలువైన 10, 20 రూపాయల నోట్లను పలువురు వ్యక్తులు సంగీతకారులపై విసిరారు. ఇవి భారీ ఎత్తున పోగుపడ్డాయి. వేదిక వద్దకు చేరుకున్న మహిళలు నోట్లు విసరడం ప్రారంభించగా, తరువాత పురుషులు వారికి జతకలిశారు. దీంతో అక్కడ నోట్ల వర్షం కురిసింది. 

  • Loading...

More Telugu News