: ‘నుబియా’ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల


భారత మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ జెడీటీఈ బ్రాండ్ ‘నుబియా’ ఈ ఫోన్లను తీసుకొచ్చింది. నుబియా జెడ్ 11, నుబియా ఎన్ 1 పేర్లతో విడుదలైన ఈ ఫోన్లు నేటి నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. నలుపు, బంగారు రంగుల్లో లభ్యమయ్యే నుబియా జెడ్ 11 ధర రూ.29,999 కాగా, నుబియా ఎన్1 ధర రూ.11,999గా ఉంది.

 ఈ ఫోన్ల ప్రత్యేకతల విషయానికొస్తే..నుబియా జెడ్ 11లో... ఆండ్రాయిడ్ 6.0, 5.5 అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,16 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గా ఉన్నాయి. కాగా, నుబియా ఎన్ 1 ఫీచర్లు.. 5.5 అంగుళాల స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్,13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను కల్గి ఉన్నాయి.

  • Loading...

More Telugu News