: తెలంగాణ బస్సులకు ఏపీలో ప్లాట్ ఫామ్ లు కూడా కేటాయించడం లేదు: శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ఆర్టీసీకి చెందిన బస్సులకు ఏపీ బస్ స్టేషన్లలో ప్లాట్ ఫామ్ లు కూడా కేటాయించడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కనీస వసతులు కూడా కల్పించడం లేదని అన్నారు. ప్రైవేట్ బస్సులు కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్ తీసుకుని, స్టేజ్ క్యారియర్లుగా తిరుగుతున్నాయని విమర్శించారు. మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్లకు అదనంగా కానిస్టేబుళ్లను కేటాయించాలని కోరారు. అలాగే, గతంలో జరిగిన జబ్బార్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై మళ్లీ విచారణ జరపాలని అభిప్రాయపడ్డారు.