: ‘చిల్లర’ కష్టాల్లోనూ రూ.100 కోట్లు రాబట్టిన ‘దంగల్’


పెద్దనోట్ల రద్దుతో చిల్లర కష్టాలు ఎదుర్కొంటున్న తరుణంలో విడుదలైన  ‘దంగల్’ మాత్రం బాక్సాఫీసు వద్ద రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈ చిత్రం మూడు రోజుల క్రితం విడుదలైంది. కేవలం మూడురోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన ‘దంగల్’ రికార్డులను తిరగరాయనుంది. కాగా, ఈ ఏడాది జులైలో విడుదలైన కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ చిత్రం తొలి రోజు రికార్డులను ‘దంగల్’ తిరగరాయలేకపోయింది. ‘సుల్తాన్’ తొలిరోజు వసూళ్లు రూ.33.34 కోట్లు కాగా, ‘దంగల్’ వసూళ్లు మాత్రం రూ.29.78 కోట్లు. ఈ చిత్రం శని, ఆది వారాల్లో వరుసగా రూ. 34.25 కోట్లు, రూ.42.35 కోట్లు రాబట్టింది. ఈ మూడు రోజుల్లో కేవలం భారత్ లోనే రూ.106.95 కోట్లను వసూల్ చేసిన ‘దంగల్’ లో అమీర్ ఖాన్ ప్రధానపాత్రలో నటించాడు. 

  • Loading...

More Telugu News