: నాగర్‌కర్నూలులో రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం
నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని అచ్చంపేట మండలం హజీపూర్ స్టేజీ వద్ద కారు, ఆర్టీసీ బస్సు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.