: ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ తో పాటు ‘కూచిపూడి’ కళాకారులు కూడా ఉండాలి: సీఎం చంద్రబాబు
ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ తో పాటు కూచిపూడి నృత్యం నేర్చుకున్నకళాకారులు కూడా ఉండాలని, అందుకు తగిన ప్రోత్సాహం అందిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సిలికానాంధ్ర, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదువుతో పాటు కూచిపూడి నృత్యం నేర్పే విషయంలో కూడా పిల్లల తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సిద్ధేంద్ర యోగి హైస్కూల్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. రూ.12 వేల గౌరవ వేతనంతో అన్ని పాఠశాలల్లో నాట్య గురువులను నియమించనున్నట్లు చంద్రబాబు చెప్పారు.