: అందుకే, రాజకీయనాయకుల చర్మం మందమైంది: జేసీ దివాకర్ రెడ్డి


రాజకీయనాయకులపైన అభియోగాలు అనేవి సర్వసాధారణమని, అభియోగాలు ఉన్నా లేకున్నా బురద చల్లడం అనేది సహజమైపోయిందని.. అందుకే, రాజకీయనాయకుల చర్మం కూడా మందమైపోయిందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ‘మిమ్మల్ని ఫ్యాక్షనిస్టు అంటే మీరు సంతోషపడతారా?’ అని ఒక న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఛా.. దానంత కర్మ ఇంకోటి లేదు’ అన్నారు. తనకసలు గన్ మన్ తో  కూడా పని లేదని, వారు కేవలం అలంకారప్రాయమని, అందుకని వారిని పక్కనబెడుతున్నానని, మన పోలీసులు చాలని అన్నారు.

  • Loading...

More Telugu News