: ‘గిన్నిస్’ రికార్డు లక్ష్యంగా మహా నాట్య బృందం ప్రదర్శన


విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సిలికానాంధ్ర అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమ్మేళనానికి 18 దేశాల కళాకారులు హాజరయ్యారు. సిలికానాంధ్ర, ఏపీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న ఈ సమ్మేళనం నేటితో ముగియనుంది. గిన్నీస్ బుక్ రికార్డు లక్ష్యంగా మహా నాట్య బృందం పయనిస్తోంది. ఈ కార్యక్రమానికి  ఏపీ అసెంబ్లీ ఉప శాసనసభాపతి మండలి బుద్ద ప్రసాద్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ నేత నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News