: ఒక్క బాల్ కు 12 పరుగులు... క్రికెట్ చరిత్రలో ఊహకందని అరుదైన విజయం!
చివరి బాల్ కు 12 పరుగులు చేస్తేనే విజయం. ఈ పరిస్థితుల్లో విజయం వరిస్తుందని ఎవరైనా కల్లోనైనా అనుకుంటారా? బౌలర్ నో బాల్ వేయకుండా ఉంటే చాలు, విజయం ఖరారైనట్టే. కానీ న్యూజిలాండ్ దేశవాళీ టీ-20 పోరులో బౌలర్ అదే పని చేశాడు. క్రీజులో ఉన్నది ఆండ్రీ ఆడమ్స్ కాగా, బౌలర్ గ్రేమీ ఆల్ డ్రిడ్జ్. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది.
ఇక విజయానికి 20 ఓవర్లలో 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కౌంటీ జట్టు 19.5 ఓవర్లు ముగిసేసరికి 149 పరుగులు చేసింది. చివర్లో ఒక్క బంతికి 12 పరుగులు వచ్చేశాయి. ఎలాగంటారా? ఆఖరి బాల్ ను డ్రిడ్జ్ నోబాల్ వేశాడు. దాన్ని బ్యాట్స్ మెన్ 4 కొట్టాడు. న్యూజిలాండ్ కౌంటీ నిబంధనల్లో భాగంగా నో బాల్ కు 2 పరుగులు లభిస్తాయి. దీంతో మరో డెలివరీ, ఆరు పరుగులు జట్టుకు లభించాయి. ఆపై చివరి బంతిని ఆండ్రీ ఆడమ్స్ అద్భుత రీతిలో సిక్స్ గా మలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు. సమకాలీన క్రికెట్ చరిత్రలో ఇది అరుదైన విజయం!