: పూణెలో దారుణం... అనుమానాస్పద స్థితిలో మహిళా టెక్కీ మృతి!


ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని రోడ్డుపక్క విగతజీవిగా కనిపించింది. ఆమె ఒంటినిండా తీవ్ర గాయాలు ఉన్నాయి. ఈ దారుణ ఘటన పూణెలో కలకలం రేపింది. నగరంలోని దేహు రోడ్డులో ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ యువతి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాకు చెందిన అంతర దాస్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారిస్తున్నామని, ఆమె మృతికి కారణాలింకా తెలియరాలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News