: 'నేను కార్యకర్తగా ఉన్న వేళ... అటల్ జీ ఏం చేశారో చూడండి' అంటూ అరుదైన వీడియోను చూపించిన మోదీ!
నేడు 92వ పుట్టినరోజును జరుపుకుంటున్న మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ ఓ అరుదైన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. "ఓ పార్టీ కార్యకర్త తనను కలిసిన సమయంలో అటల్ జీ ఏం చేశారో చూడండి" అంటూ తాను ఓ కార్యకర్తగా ఉన్న సమయంలో తీసిన వీడియోను చూపారు. "మా ప్రియ అటల్ జీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ పెట్టారు. వాజ్ పేయికి పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.