: సిద్ధిపేట జిల్లాలో దారుణం...యువతి తలనరికిన దుండగులు
సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం దాతర్ పల్లి, అక్కారం గ్రామాల మధ్య దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామాలను కలిపే రోడ్డు పక్కన తల నరికేసిన ఓ యువతి మొండాన్ని కొందరు దుండగులు గోనె సంచిలో తెచ్చి వదిలేశారు. మొండాన్ని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, మృతురాలి వివరాలు తెలియలేదు. ఈ ఘటన సిద్ధిపేట పరిసరాల్లో ఆందోళన రేపుతోంది.