: ఆర్కిటిక్ లో 5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది


భూతాపం పెరిగిపోతోందనేందుకు ఊహించని విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే నిదర్శనమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు క్రిస్మస్‌ కు ఆర్కిటిక్‌ లో 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆర్కిటిక్‌ ప్రాంతంలో అసహజ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని వారు పేర్కొన్నారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ మార్పులు సంభవించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నవంబర్‌-డిసెంబర్‌ మధ్యలో సాధారణంగా ఏర్పడే ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని వారు వెల్లడించారు. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, వెయ్యేళ్లలో ఒకసారి ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయని ఆక్స్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకుడు ఫ్రెడిరైక్‌ ఒట్టో అభిప్రాయపడ్డారు. ఇకపై ఏటా 2 శాతం మేర ఆర్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News