: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కోచ్ గా సెహ్వాగ్
ఐపీఎల్ లో లీగ్ దశను దాటేందుకు నానాతంటాలు పడుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఈసారి టోర్నీలో ఎలాగైనా సత్తాచాటాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రీతి జింటా సహయజమానిగా ఉన్న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఒకే ఒకసారి సెమీస్ వరకు చేరుకోగలిగింది. దీంతో జట్టు ప్రతిష్ఠ మసకబారింది. స్టార్లున్నా జట్టు ఫలితాల్లో మార్పు రాకపోవడంతో కోచ్ మార్పు దిశగా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ జట్టుకు సుదీర్ఘ కాలం కోచ్ గా ఉన్న సంజయ్ బంగర్ స్థానంలో టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కోచ్ గా నియమించే ఏర్పాట్లలో మునిగిపోయింది. జట్టు సభ్యుడిగా ఉన్న సెహ్వాగ్ ను కోచ్ గా నియమించి, దూకుడు పాఠాలు నేర్పడం ద్వారా జట్టును విజయపథంలో నిలపాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తోంది. దీంతో ఈ సీజన్ లో సెహ్వాగ్ ఆడడం సంగతి సందిగ్థంలో పడగా, కోచ్ గా కొత్త భూమిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.