chandrababu: మంత్రి రావెల, జడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూన్ మధ్య వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. విచారణకు కమిటీ ఏర్పాటు!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి రావెల కిశోర్‌బాబు నుంచి తనకు, త‌న భర్తకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్ నిన్న మీడియాకు మొర పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అనంత‌రం ఆమె జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌పై మంత్రి రావెల కూడా స్పందిస్తూ.. జానీమూన్ తో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకుంటామ‌ని మీడియా ముందుకు వచ్చి మరీ చెప్పారు.

అయితే, ఇలా వీరిద్దరూ మీడియా ముందుకు రావ‌డం పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘటనపై త్రిసభ్య కమిటీ ద్వారా విచారణ జరపాల‌ని, అనంత‌రం త‌నకు నివేదిక ఇవ్వాలని టీడీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావుకి సూచించారు. ఈ త్రిస‌భ్య క‌మిటీ గురించి టీడీపీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టి.డి.జనార్దన్ మాట్లాడుతూ... ఈ క‌మిటీలో రాష్ట్ర మంత్రి చినరాజప్ప, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు ఉంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News