: ఆ పార్టీ అంటే కేసీఆర్ కు భయమా?
కేసీఆర్.. మాటలతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో దిట్ట. అంతేగాకుండా, రాజకీయ పరంగా ఎత్తులు పై ఎత్తులు వేయడంలోనూ మాస్టర్ ఈ టీఆర్ఎస్ అధినేత. అంతటి కేసీఆర్ కూడా తమ పార్టీని చూసి భయపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. అందుకే టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారని బాబు వివరించారు. బయ్యారం, ఓబుళాపురం గనుల విషయంలో పోరాడింది తామేనని బాబు గుర్తు చేశారు. పోరాటాలు చేస్తున్న పార్టీని దెబ్బతీయాలన్నదే వారి ప్రయత్నమని బాబు చెప్పుకొచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ లో బాబు ఈ విషయాలు పంచుకున్నారు.