: మావోయిస్టుల దుశ్చర్య... మహారాష్ట్రలో 75 ట్రక్కులకు నిప్పు
మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సూరజ్ గఢ్ ప్రాంతంలో 75 ట్రక్కులకు నిప్పు పెట్టారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఓ మైనింగ్ కంపెనీ నుంచి ఐరన్ ఓర్ ఖనిజంతో వెళుతున్న ట్రక్కులను సుమారు 500 మంది వరకు మావోయిస్టులు అడ్డుకున్నారు. అనంతరం వాటికి నిప్పంటించారు. మైనింగ్ కంపెనీ కార్మికులను సైతం మూడు గంటల పాటు నిర్బంధించి, ఆ తర్వాత విడిచిపెట్టినట్టు సమాచారం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఇక్కడ మైనింగ్ ను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికుల సహకారంతో మావోయిస్టులు ఇక్కడ ఐరన్ ఓర్ తవ్వకాలను నిలిపివేయించగా... ప్రభుత్వం ఇటీవలే ప్రైవేటు కంపెనీలకు తవ్వకాల కాంట్రాక్టులను కట్టబెట్టింది.