: ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్ వైపు మళ్లాల్సిన అవసరం ఉంది!: ముఖ్యమంత్రి చంద్రబాబు
పూర్తిగా నగదు రహిత లావాదేవీలు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాలకే అది సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన 197వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు క్రమంగా క్యాష్‌లెస్ వైపు మళ్లాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ప్రజల మనస్తత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ నంబరుతో సులభంగా నగదు మార్చుకునే సౌలభ్యాన్ని కనుగొన్నట్టు తెలిపారు. పెద్ద నోట్లతో దేశంలోని ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.