: బెంగాలీ కవి శంఖ ఘోష్ కు జ్ఞానపీఠ్ పురస్కారం
ప్రముఖ బెంగాలీ కవి షంఖ ఘోష్ కు జ్ఞానపీఠ్ పురస్కారం దక్కింది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘జ్ఞానపీఠ్’ను ఈ ఏడాది షంఖ ఘోష్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జ్ఞానపీఠ్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. కాగా, షంఖ ఘోష్ 1932లో చాంద్ పూర్ లో జన్మించారు. ఇది ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉంది. మోడరన్ బెంగాలీ సాహిత్యంలో ఆయన దిట్ట. కోల్ కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఆయన బెంగాలీ లిటరేచర్ లో పట్టా పొందారు.