: నాసా ఫోటోలలో.. మార్స్ పై స్పూను లాంటి వస్తువు?


అంగారక గ్రహంపై స్పూన్ లాంటి వస్తువు కనిపించడంతో అక్కడ జీవం ఉందని ఔత్సాహిక పరిశోధకులు చెబుతున్నారు. మార్స్ పై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ గత కొంత కాలంగా అక్కడి నుంచి చిత్రాలు పంపుతున్న సంగతి తెలిసిందే.  ఎగిరే వస్తువుల (ఫ్లైయింగ్ ఆబ్జక్ట్స్) గురించి పరిశోధనలు చేసే కొందరు ఔత్సాహికులు నాసా విడుదల చేస్తున్న చిత్రాలను వివిధ కోణాలలో విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా వీరే గతంలో మార్స్ పై ఓ మహిళ, బూట్లు, గన్ వంటివి ఉన్నట్టు గుర్తించారు. తాజాగా స్పూన్ లాంటి వస్తువును వీరు విశ్లేషణలో గుర్తించారు. దీంతో వారంతా మార్స్ పై జీవం ఉందని పేర్కొంటున్నారు. అయితే నాసా, ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం మార్స్ పై జీవం ఉందని తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని, అవన్నీ భ్రాంతులని స్పష్టం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News