: ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఇవే!
2005 నుంచి జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయకుండా... కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొరడా ఝళిపించింది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 12 రాజకీయ పార్టీల నమోదును కూడా రద్దు చేసింది. ఈసీ రద్దు చేసిన రాజకీయ పార్టీలు.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, అన్న తెలుగుదేశం పార్టీ, ఆంధ్రానాడు పార్టీ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజాపార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, ముదిరాజ్ రాష్ట్రీయ సమితి, నేషనల్ సిటిజన్ పార్టీ, సత్యయుగ్ పార్టీ, భారతీయ సేవాదళ్, ఆల్ ఇండియా సద్గుణ పార్టీ, బహుజన రిపబ్లికన్ పార్టీలు ఉన్నాయి. కాగా, దేశ వ్యాప్తంగా మొత్తం 255 నమోదిత రాజకీయ పార్టీలపై ఈసీ వేటు వేసింది.