: పిరమిడ్ యోగా గురు సుభాస్ పత్రీపై పోలీస్ స్టేషన్ లో వైద్యుడి ఫిర్యాదు


మహబూబ్ నగర్ జిల్లా కడ్తాల్ లో పిరమిడ్ ధ్యానం పేరుతో ఆశ్రమం ప్రారంభించిన యోగా గురు సుభాష్ పత్రీ అనుచరులు దాడి చేశారంటూ ఆనంద్ అనే వైద్యుడు హైదరాబాదులోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ధ్యానమహోత్సవాలు నిర్వహిస్తున్న పత్రీ ధ్యానం పేరుతో సాగిస్తున్న అసాంఘిక కార్యకలాపాలను బయటపెడతానేమోనన్న ఆందోళనతో తనపై దాడి చేశారంటూ ఆయన తెలిపారు. పిరమిడ్ ధ్యాన కేంద్రంలోకి వచ్చేవారంతా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారేనని ఆయన చెప్పారు. స్క్రిజోఫీనియా లక్షణాలతో బాధపడుతున్న వారిని యోగా, ధ్యానం అంటూ పత్రీ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీటిని విమర్శించానని తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, తనను వెంటబడి తరిమారని ఆయన ఫిర్యాదులో ఫేర్కొన్నట్టు తెలిపారు. 

  • Loading...

More Telugu News