: నేను రాజీనామా చేయలేదు..టీడీపీలో చేరే ప్రసక్తే లేదు!: వైఎస్సార్సీపీ నాయకుడు కోలగట్ల
విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేశానని, టీడీపీలో చేరతానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని పత్రికలు అసత్య కథనాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాగా, వైఎస్సార్సీపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీలో తన పదవికి ఆయన రాజీనామా చేస్తున్నారనే వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కారణంగా విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని భావించిన కోలగట్ల తన పదవికి రాజీనామా చేశారనే వదంతుల నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేశారు.