: ప్రపంచం ముందు కొత్త సమస్య... తమ చిన్నారులను జీహాదీలను చేస్తున్న సిరియా తల్లులు... వీడియో విడుదల!


ఇరాక్, సిరియా దేశాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా ఏరివేస్తూ, ఒక్కో నగరాన్నీ స్వాధీన పరచుకుంటూ భద్రతా దళాలు ముందుకు సాగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ, ప్రపంచాన్ని వణికిస్తోంది. ఓ వీడియోలో సిరియాకు చెందిన ఓ మహిళ, తన 7, 9 సంవత్సరాల వయసున్న కుమార్తెలను జీహాద్ కు ప్రిపేర్ చేస్తూ, వారు ఆత్మాహుతి దాడులు చేయాలని ప్రేరేపిస్తున్న వీడియో ఒకటి విడుదలైంది.

"నువ్వు ఈ రోజు ఏం చేస్తావు?" అన్న తల్లి ప్రశ్నకు "డమాస్కస్ పై ఆత్మాహుతి దాడి చేస్తాను" అని కుమార్తె చెబుతుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. "మీరు భయపడవద్దు. మీరు దేవుడి దగ్గరకు వెళుతున్నారు. అల్లాహు అక్బర్ అనుకోండి" అని వారి తండ్రి చెబుతుండటం ఉంది. చిన్న చిన్న పిల్లలను ఎందుకు ఉగ్రవాదులుగా మారుస్తున్నారని తల్లిదండ్రులను ప్రశ్నించగా, పవిత్ర యుద్ధానికి వయసుతో సంబంధం లేదని, ఈ యుద్ధం ప్రతి ముస్లిం కర్తవ్యమని వారు సమాధానం చెబుతుండటం, ప్రపంచం ముందుకురానున్న కొత్త సమస్యలకు అద్దం పడుతోంది.

  • Loading...

More Telugu News