: మీ కంటే మందుబాబులే నయం: మంత్రులతో చంద్రబాబు


మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీలు, ముఖ్య అధికారులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధిని గురించి చర్చిస్తున్న వేళ, నగదు రహిత లావాదేవీల ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మీకంటే మందుబాబులే నయం'' అంటూ జోకేసి అందరినీ నవ్వించారు. ఇక్కడున్న వారిలో ఎంత మంది మొబైల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో చేతులు ఎత్తాలని సీఎం కోరగా, అక్కడున్న వారిలో 20 శాతం మంది కూడా స్పందించలేదు. దీంతో మీరే ఇలా ఉంటే, ప్రజలకిక నగదు రహిత ట్రాన్సాక్షన్స్ గురించి ఎలా చెబుతామని బాబు ప్రశ్నించారు.

ఆపై, సాయంత్రానికి మందు లేకుంటే మైండ్ పనిచేయదన్న ఉద్దేశంతో మందుబాబులు మెదడుకు మేత పెట్టి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో నేర్చేసుకున్నారని అన్నారు. డెబిట్ కార్డు ఇచ్చి బార్‌ లు, వైన్‌ షాపుల్లో స్వైపింగ్ చేస్తున్నారని చెప్పారు. స్వైపింగ్, మొబైల్ మాధ్యమంగా లావాదేవీలు జరిగేలా మైండ్ సెట్ మార్చుకోవాలని చురకలేశారు.  

  • Loading...

More Telugu News