: కేసీఆర్ దత్తత గ్రామాల్లో పండుగ శోభ... డబుల్ బెడ్ రూమ్ లు ప్రారంభించిన కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ ను కూడా ప్రారంభించారు. కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లిలో 330 ఇళ్లు, నర్సన్నపేటలో 159 ఇళ్లకు సామూహిక గృహప్రవేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.