: ఉప రాష్ట్రపతి రేసులో లేను: నజీబ్ జంగ్


ఉప రాష్ట్రపతి రేసులో తాను లేనని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నజీబ్ జంగ్ పేర్కొన్నారు. పుస్తకాలు చదువుకోవడం, విద్యాపరమైన విషయాలపైనే తన దృష్టి కేంద్రీకరిస్తానని, అందుకే, తాను రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా విషయమై తనపై ఎవ్వరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  కేజ్రీవాల్ తో వ్యక్తిగతంగా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తనపై కేజ్రీవాల్ గతంలో చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించేందుకు నజీబ్ నిరాకరించారు.

  • Loading...

More Telugu News