: ఇంతవరకూ నేను ఆ అవార్డు పొందలేదు..అర్హుడిని కానేమో ! : షారూక్ ఖాన్


ఇంతవరకూ తాను జాతీయ అవార్డును పొందలేదని, ఆ అవార్డుకు తాను అర్హుడిని కానేమోనని బాలీవుడ్ బాద్ షా, విలక్షణ నటుడు షారూక్ ఖాన్ అన్నారు. ఇటీవల ముంబయిలో ఇండియన్ అకాడమీ అవార్డులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘జాతీయ అవార్డు వచ్చిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెబుతారా?’ అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ‘నేను ఇంతవరకూ ఆ అవార్డు తీసుకోలేదు కదా!’ అని షారూక్ నిట్టూర్పు విడిచారు. ‘నా ప్రదర్శనలన్నీ జాతీయ అవార్డుకు దూరంగా ఉన్నాయేమో నాకు తెలియదు. సినీ నటుడిగా ఉండటమంటే నాకు ఇష్టం. అలానే అవార్డులు అందుకోవడమన్నా. కానీ, అవార్డుల కోసమే నటించను’ అని షారూక్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News