: హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు !
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. చిలకలగూడ, వారాసిగూడ నేరెడ్ మెట్ లో మహిళల బంగారు గొలుసులను తెంపుకుపోయారు. చిలకలగూడలో వృద్ధురాలి గొలుసును, నేరెడ్ మెట్ లో ఒక మహిళ నుంచి 2.5 తులాల బంగారం గొలుసును, వారసిగూడలో మరో మహిళ నుంచి 3.5 తులాల గొలుసును చైన్ స్నాచర్లు కొట్టేశారు. ఈ నేపథ్యంలో చైన్ స్నాచర్ల కోసం పోలీసులు నాకాబందీ నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు.