: హైదరాబాద్లో రాష్ట్రపతి ప్రణబ్కి ఘనస్వాగతం పలికిన నరసింహన్, కేసీఆర్
దక్షిణాది రాష్ట్రాల శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైమానిక దళ విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని హకీం పేటకు చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఆయన ఈ నెల 31 వరకు ఇక్కడ బస చేస్తారు.