: ఇకపై తెలుగులోనే ఈ-మెయిల్ అడ్రసు రూపొందించుకోవచ్చు!
‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ బ్రాండ్ బ్యాండ్ వినియోగదారులు ఇకపై 8 భారతీయ భాషల్లో తమ ఈ-మెయిల్ అడ్రసు రూపొందించుకోవచ్చు. ఈ మేరకు జయపురకు చెందిన డేటా మెయిల్ తో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రసును రూపొందించుకునే సౌకర్యం వినియోగదారులకు అందుబాటులోకి రానుందని బీఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎనిమిది భాషల్లో హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషలు ఉన్నాయి. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో డేటా మెయిల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చని వినియోగదారుల సేవలకు సంబంధించిన బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఎన్ కే గుప్తా పేర్కొన్నారు.