: టర్కీలో అవస్థలు పడుతున్న విజయనగరం వాసులు!
ఉపాధి నిమిత్తం టర్కీ దేశానికి వెళ్లిన ఏపీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని రంగరాయపురం, పెంట, చల్లారపువలస గ్రామాలకు చెందిన పదకొండు మంది ఉపాధి నిమిత్తం టర్కీ వెళ్లారు. అయితే, వారు పనిచేస్తున్న పరిశ్రమ మూతపడటంతో వారికి అవస్థలు మొదలయ్యాయి. స్వగ్రామానికి తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ సందర్భంగా బాధితుల కుటుంబీకులు మాట్లాడుతూ, వారిని ఇక్కడకు తీసుకువచ్చేందుకు చొరవచూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.