: స్నాప్ డీల్ బంపర్ ఆఫర్.. క్యాష్ @ హోమ్!


పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బ్యాంకులు, ఏటీఎం ల వద్ద గంటల తరబడి ‘క్యూ’లో నిలబడ్డా ఆశించిన నగదు చేతికి అందని పరిస్థితులు. ఈ నేపథ్యంలో దేశీయ ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ దిగ్గజం స్నాప్ డీల్ ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. ‘క్యాష్ @ హోమ్’ సేవల కింద ప్రజలకు నగదును ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈరోజు నుంచి ఈ సేవలను ప్రారంభిస్తున్నామని, ప్రజలకు కనీస అవసరాల నిమిత్తం నగదును తమ ఇంటివద్దకే డెలివరీ చేయనున్నట్టు చెప్పింది.

 ఈ సేవల కింద గరిష్టంగా ఒక బుకింగ్ కు రూ.2000 వరకు నగదును ‘స్నాప్ డీల్’ డెలివరీ చేయనుందని పేర్కొంది.  ఈ సర్వీసు ద్వారా నగదు డెలివరీ చేసిన సమయంలోనే యూజర్లు తమ బ్యాంకు ఏటీఎం కార్డును పోస్ మిషన్ లో స్వైప్ చేసి స్నాప్ డీల్ కు ఈ నగదు చెల్లించాలని, నామమాత్రపు రుసుం కింద కేవలం ఒక్క రూపాయిని కంపెనీ చార్జ్ చేస్తుందని అన్నారు. అయితే, బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ రుసుంను డెబిట్ కార్డు ద్వారా లేదా ప్రీ చార్జ్ ద్వారా నైనా చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

‘క్యాష్ @ హోమ్’ సర్వీసుల కింద మరే ఇతర ఆర్డర్లను స్నాప్ డీల్ స్వీకరించదని, గుర్గావ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఈ సర్వీసులను ప్రారంభించిందని, మిగిలిన పెద్ద నగరాల్లో త్వరలోనే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని ‘స్నాప్ డీల్’ పేర్కొంది.
 

  • Loading...

More Telugu News