: అప్పట్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందం ఉందేమో: కేజ్రీవాల్
ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్పొరేట్ వర్గాల నుంచి మోదీ ముడుపులు అందుకున్నారని రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఆరోపణపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. మోదీ అవినీతి గురించి 2013లోనే తెలిస్తే... అప్పుడు చర్యలెందుకు తీసుకోలేదని రాహుల్ ను నిలదీశారు. ఆ సమయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఒప్పందం ఏమైనా ఉండేదేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు.