: విచారణ జరగకుండానే నేను తప్పుచేసినట్లు ఎలా చెబుతారు?: చెవిరెడ్డి మండిపాటు


విచారణ జరగకుండానే తాను తప్పుచేసినట్లు ఎలా చెబుతారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ ప్రివిలేజ్ కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రవణ్ ను నిలదీశారు. ఈ నేపథ్యంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం నుంచి ఆయన వాకౌట్ చేశారు. వీడియో క్లిప్పింగ్ లలో తాను తప్పు చేసినట్లు ఎక్కడా లేదని కమిటీ సభ్యులతో అన్నారు. ప్రివిలేజ్ కమిటీనే సభ్యుల హక్కులను కాలరాస్తోందని, సభ నుంచి తనను సస్పెండ్ చేయాలని ముందే నిర్ణయించుకున్నారని మండిపడ్డారు. సభలో తాను ఉండకూదని సీఎం చంద్రబాబు కుట్రపన్నారని ఈ సందర్భంగా చెవిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 

  • Loading...

More Telugu News