: 2016 ఐసీసీ అవార్డుల విజేతలు వీరే
2016 సంవత్సరానికిగాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రవిచంద్రన్ అశ్విన్ కు ఈ ఏటి మేటి క్రికెటర్ అవార్డుతో పాటు ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు కూడా దక్కిన సంగతి తెలిసిందే. ఇక వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సౌతాఫ్రికా ఆటగాడు క్విన్టన్ డీ కాక్ కు దక్కగా, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కు ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. టీ-20 పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడిగా వెస్టిండీస్ కు చెందిన కార్లోస్ బ్రాత్ వైట్ ఎంపికయ్యాడు.
ఐసీసీ అనుబంధ అసోసియేట్ దేశాల క్రికెటర్లలో ఉత్తమ ఆటగాడిగా ఆఫ్గనిస్థాన్ కు చెందిన మొహమ్మద్ షహజాద్ ఎంపికయ్యాడు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు మిస్బా ఉల్ హక్, ఉత్తమ అంపైర్ గా మారిస్ ఎరాస్మస్ ఎంపికైన సంగతి విదితమే. అవార్డు విజేతలందరికీ ఐసీసీ అభినందనలు తెలిపింది.
ఇక ఐసీసీ ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ - 2016లో ఇండియాకు చెందిన స్మృతీ మందనకు మాత్రమే స్థానం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా వెస్టిండీస్ కు చెందిన స్టెఫానీ టేలర్ ఎంపికైంది.