: ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్ గా అశ్విన్... మిగతా అవార్డు విజేతల వివరాలు!
2016 సంవత్సరానికిగాను ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రవిచంద్రన్ అశ్విన్ కు పెద్దపీట దక్కింది. ఈ సంవత్సరం అత్యుత్తమ క్రికెటర్ అవార్డుతో పాటు ఉత్తమ టెస్టు క్రికెటర్ అవార్డు కూడా అశ్విన్ ఖాతాలోకి వెళ్లింది. ఈ ఏటి ఉత్తమ క్రికెటర్ అవార్డులో భాగంగా సర్ గారీఫీల్డ్ ట్రోఫీని అశ్విన్ అందుకోనున్నాడు. ఇక స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు పాక్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ఎంపికయ్యాడు. ఈ అవార్డును అందుకోనున్న తొలి పాక్ క్రికెటర్ మిస్బాయే. ఇదే అవార్డు 2011లో ధోనీకి, 2012లో డానియల్ వెటోరీకి, 2013లో మహేల జయవర్ధనేకు, 2014లో కేథరిన్ బ్రుంట్ కు, 2015లో బ్రెండన్ మెకల్లమ్ ను వరించిన సంగతి తెలిసిందే. ఇక ఉత్తమ అంపైర్ గా సౌతాఫ్రికాకు చెందిన మారిస్ ఎరాస్మస్ ఎంపికయ్యారు. ఈ అవార్డును డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ పేరిట ఐసీసీ అందిస్తున్న సంగతి తెలిసిందే.