: టీ20లో న్యూజిలాండ్ ప్రపంచ రికార్డు.. 40 ఓవర్లలో 497 పరుగులు
టీ20 చరిత్రలో మరో ప్రపంచ రికార్డు నమోదైంది. న్యూజిలాండ్‌లో జరుగుతున్న దేశవాళీ టోర్నీ సూపర్ స్మాష్‌లో భాగంగా బుధవారం సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో జట్లు తలపడ్డాయి. రెండు జట్లు కలిసి మొత్తం 40 ఓవర్లలో ఏకంగా 497 పరుగులు చేశాయి. దీంతో గత ఆగస్టులో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య లాడర్‌హిల్‌లో జరిగిన మ్యాచ్‌లో నమోదైన అత్యధిక పరుగుల(489) రికార్డు బద్దలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఒటాగో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. 250 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి ఓటమి పాలైంది.