: విజయవాడలో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు: రాంగోపాల్ వర్మ


అసలు అప్పట్లో విజయవాడలో ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదని రాంగోపాల్ వర్మ అన్నారు. 'వంగవీటి' సినిమా ప్రమోషన్ లో ఆయన మాట్లాడుతూ, విజయవాడ ప్రజల్లో ఉన్న స్పెక్యులేషన్సే వాస్తవాలన్న ఆలోచనలో వారు ఉన్నారని చెప్పారు. తాను అవి తప్పని చెప్పడం లేదని, అవుననీ చెప్పడం లేదని చెప్పారు. తానేం చెప్పానో సినిమాలో చూసి తెలుసుకోవాలని అన్నారు. తాను తీసిన సినిమాను చూసి పాతగాయం రేగుతుందని అనుకోవడం భ్రమ అని ఆయన చెప్పారు. 'వంగవీటి' సంఘటనలన్నీ రెండు కుటుంబాల మధ్య జరిగిన సంఘటనలని, ఆ రెండు కుటుంబాలకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను చూడడం మానేసి ఊహల్లోనే ఉండకూడదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News