: 2017-18 లో ఎనిమిది భాషల్లో ‘నీట్ ’
దేశంలో మొత్తం ఒకే రకమైన వైద్య విద్యా విధానం ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ వైద్య విద్య అర్హత ప్రవేశ పరీక్ష (నీట్). 2017-18లో ఎనిమిది భాషల్లో నీట్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ భాషల్లో దీనిని నిర్వహించనుంది.