: 2012, 2013 సినీ నంది అవార్డుల ఎంపికకు జయసుధ, కోడి రామకృష్ణ నేతృత్వంలో కమిటీలు


2012, 2013 సంవత్సరాలకు గాను సినీ, టీవీ రంగాల్లో అవార్డు విజేతల ఎంపికకు ఏపీ ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  2012 నంది అవార్డుల ఎంపికకు ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో 12 మంది సభ్యులతో, 2013 నంది అవార్డుల ఎంపికకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ఆయా కమిటీలను  ఏర్పాటు చేశారు.

కాగా, ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి, రఘుపతి వెంకయ్య అవార్డుల ఎంపికకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, సినీనటుడు బాలకృష్ణ, కృష్ణంరాజు, మురళీ మోహన్, ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్, శాంతా బయోటిక్స్ ఎండీ వరప్రసాద్ రెడ్డి, ఏపీఎఫ్ఎఫ్ టీవీటీడీసీ ఎండీ ఉన్నారు. వీటితో పాటు టీవీ నంది అవార్డులకు కూడా కమిటీలను నియమించారు. 

  • Loading...

More Telugu News