: ఇది అసెంబ్లీనా? లేక కేసీఆర్ భవనా?: రేవంత్ రెడ్డి


తెలంగాణ అసెంబ్లీ కేసీఆర్ భవన్ లా మారిందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు విమర్శించారు. తమ ఇష్టానుసారం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా విడిపోయిందని అన్నారు. తెలంగాణలోని విద్యుత్ వెలుగులకు తమ అధినేత చంద్రబాబే కారణమని చెప్పారు. తెలంగాణకు అధిక విద్యుత్ ను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకెళదామని చంద్రబాబుకు కొందరు సూచించారని... అయితే, చంద్రబాబు కోర్టుకు వెళ్లలేదని తెలిపారు. రాష్ట్రంలో నకిలీ విత్తన కంపెనీలు చెలరేగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News