: నల్గొండ, మిర్యాలగూడ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లు!


తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటిరెడ్డి ఈ రోజు అసెంబ్లీలో సవాల్ విసిరారు. మిర్యాల గూడ ఎమ్మెల్యే భాస్కరరెడ్డి రాజీనామా చేసి, తిరిగి పోటీ చేసి, కనీసం డిపాజిట్ తెచ్చుకోగలిగితే, టీఆర్ఎస్ కార్యాలయంలో తాను వాచ్ మన్ గా పని చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దీంతో స్పందించిన భాస్కరరెడ్డి ప్రతి సవాల్ చేయగా ...ఇద్దరమూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం, ఎవరికి డిపాజిట్లు గల్లంతవుతాయో చూద్దామంటూ' ప్రతిసవాల్ విసిరారు. ఆ విధంగా ఈ రోజు ఈ ఇద్దరు నేతలూ సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభను హోరెత్తించారు.  

  • Loading...

More Telugu News