: ట్విట్టర్ సంస్థలో మరో రెండు టాప్ వికెట్లు ఔట్!
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయి. సంస్థను వదిలిపెట్టి పోతున్న టాప్ లెవెల్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆడమ్ మెసింజర్, ప్రాడక్ట్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ జోష్ మెక్ ఫర్లాండ్ లు కంపెనీకి గుడ్ బై చెప్పారు. గత ఐదేళ్లుగా మెసింజర్ ట్విట్టర్ సంస్థలో పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. "ఐదేళ్లు పనిచేసిన తర్వాత ట్విట్టర్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. నాకు పనిచేసే అవకాశం కల్పించిన సీఈవో జాక్ కు, నాతో పనిచేసిన సహచరులకు రుణపడి ఉంటా" అంటూ మెసింజర్ తెలిపారు.